కళ్ల కింద నల్లటి వలయాలు.. తగ్గాలంటే..!
కళ్ల కింద నల్లటి వలయాలు.. చాలామందిని వేధించే సమస్య. పిల్లలు.. పెద్దలు.. అనే తేడా లేకుండా ఏ వయసు వారికైనా ఈ సమస్య ఎదురు కావచ్చు. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్‌పై గడపడం, టీవీ ఎక్కువగా చూడటం, పదేపదే కాఫీ తాగడం, ఎక్కువ ఒత్తిడికి గురికావడం, పోషకాహార లోపం.. మొదలైనవన్నీ కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణాలే.